ఇంటి పని, వంట పని చేసిన ‘మగధీరుడు’

కథానాయకుడు రామ్‌ చరణ్‌ ఇల్లు తుడిచి, మొక్కలకు నీరు పోసి, సతీమణి ఉపాసనకు స్వయంగా కాఫీ చేసి ఇచ్చారు. ఆయన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఛాలెంజ్‌ స్వీకరించి.. ‘బి ద రియల్‌ మేన్‌’లో పాల్గొన్నారు. ఇంటి పనితోపాటు వంట పని కూడా చేసేశారు. ఈ పనులు చేయడాన్ని గర్వంగా భావించాలని.....

Published : 21 Apr 2020 15:05 IST

ఇప్పుడు త్రివిక్రమ్‌, రణ్‌వీర్‌, రానా వంతు..!

హైదరాబాద్‌: కథానాయకుడు రామ్‌ చరణ్‌ ఇల్లు తుడిచి, మొక్కలకు నీరు పోసి, సతీమణి ఉపాసనకు స్వయంగా కాఫీ చేసి ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఛాలెంజ్‌ స్వీకరించి.. ‘బి ద రియల్‌ మేన్‌’లో పాల్గొన్నారు. ఇంటి పనితో పాటు వంట పని కూడా చేసేశారు. ఈ పనులు చేయడాన్ని గర్వంగా భావించాలని ఈ సందర్భంగా చరణ్‌ చెప్పారు. ఇంట్లోని మహిళ పని భారాన్ని పంచుకుని నిజమైన పురుషుడిలా వ్యవహరిద్దామని పేర్కొన్నారు. అంతేకాదు దర్శకుడు త్రివిక్రమ్‌, బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌, రానా, శర్వానంద్‌కు సవాలు విసిరారు.

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘బి ద రియల్‌ మేన్‌’ ఛాలెంజ్‌ను ఆరంభించారు. ఇంటి పనుల్లో పాలుపంచుకుంటూ మహిళలకి సాయంగా నిలవాలన్నదే ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం. సందీప్‌ రెడ్డి తను ఇంటి పనిచేస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ.. రాజమౌళి కూడా వీడియో అప్‌లోడ్‌ చేయాలని కోరారు. ఆపై రాజమౌళి ఇంటి పనిచేసి.. తారక్‌, చరణ్‌ తదితరుల్ని నామినేట్‌ చేశారు. ఎన్టీఆర్‌ కూడా ఈ సవాలును స్వీకరించి.. మంగళవారం ఉదయం వీడియోను షేర్‌ చేశారు. ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం’ అంటూ బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, కొరటాల శివకి ఛాలెంజ్‌ విసిరారు.

తారక్‌ సవాలుకు చిరు స్పందిస్తూ.. ‘ఛాలెంజ్‌ స్వీకరించా. అలాగే నీ స్నేహితుడు చరణ్‌ వీడియో కోసం ఎదురుచూస్తున్నా..’ అని కామెంట్‌ చేశారు. ‘సవాలు స్వీకరిస్తున్నా తారక్‌ అన్నయ్య. నెల రోజుల ఫుటేజీ ఇప్పటికే మిస్‌ అయ్యింది..’ అని కొరటాల శివ ట్వీట్‌ చేశారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని