పెళ్లి ఫొటోలపై అమలాపాల్‌ ఏమందంటే..

కథానాయిక అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పెళ్లి జరిగిందంటూ ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌తో విడిపోయిన తర్వాత ఓ వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో......

Updated : 08 Dec 2022 17:49 IST

చెన్నై: కథానాయిక అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పెళ్లి జరిగిందంటూ ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌తో విడిపోయిన తర్వాత ఓ వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. కానీ ఆయన ఎవరో మాత్రం వెల్లడించలేదు. ఇదే సమయంలో ముంబయికి చెందిన గాయకుడు భవ్‌నీందర్‌ సింగ్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆమె, భవ్‌నీందర్‌ సింగ్‌ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆయన అమలాపాల్‌ నుదుట కుంకుమ పెడుతూ కనిపించారు. అయితే ఆ ఫొటోలపై ఆమె అప్పట్లో స్పందించలేదు

వీటిపై అమలాపాల్‌ను ప్రశ్నించగా.. ‘నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నా. సినిమా షూటింగ్స్‌ పూర్తయితే.. నా పెళ్లి గురించి ప్రకటిస్తా. ఇప్పటికే నా ప్రియుడి గురించి నేను మాట్లాడా. కాబట్టి వివాహం గురించి కూడా చెబుతా. అప్పటి వరకు నా పెళ్లిపై ఎటువంటి ప్రచారం చేయొద్దు. సమయం వచ్చినప్పుడు నేను దాని గురించి చెబుతా’ అని అన్నారు.

2014లో దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌తో అమలాపాల్‌ వివాహం జరిగింది. సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమించుకున్న వీరిద్దరు ఆపై పెద్దల సమ్మతంతో ఒక్కటయ్యారు. వీరిమధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో 2017లో విడిపోయారు. అమలాపాల్‌ ప్రస్తుతం తెలుగు వర్షెన్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’లో నటిస్తున్నారు. అదేవిధంగా మహేశ్‌ భట్‌ తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చదవండి..

సతీమణి కోసం సుకుమార్‌ ఏం చేశారంటే?

ఖననానికి నా కాలేజ్‌ వాడుకోండి: విజయ్‌కాంత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని