కరోనాపై పోరు.. విజయ్‌ భారీ విరాళం

కరోనా వైరస్‌పై పోరుకు తమిళ కథానాయకుడు విజయ్‌ భారీ విరాళం ప్రకటించారు. తన సొంత రాష్ట్రం తమిళనాడుతోపాటు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు కూడా ఆర్థిక సాయం చేశారు. మొత్తం రూ.1.3 కోట్లు ఆయన విరాళంగా ప్రకటించారు. ఇందులో ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు.....

Published : 22 Apr 2020 15:59 IST

తమిళనాడుతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా..

చెన్నై: కరోనా వైరస్‌పై పోరుకు తమిళ కథానాయకుడు విజయ్‌ భారీ విరాళం ప్రకటించారు. తన సొంత రాష్ట్రం తమిళనాడుతోపాటు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు కూడా ఆర్థిక సాయం చేశారు. మొత్తం రూ.1.3 కోట్లు ఆయన విరాళంగా ప్రకటించారు. ఇందులో ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా సినీ కళాకారుల కోసం పనిచేస్తున్న ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌంత్‌ ఇండియా సంఘానికి రూ.25 లక్షలు సాయం చేశారు. అంతే కాకుండా విజయ్‌ తన అభిమాన సంఘాల ద్వారా లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారికి నేరుగా సాయం చేస్తున్నారు.

గోపీచంద్‌ మంచి మనసు

లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల్ని ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీకి టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. అదేవిధంగా 1500 మందితో కూడిన అనాథ శరణాలయానికి ఆహారం అందిస్తున్నారు. రెండు నెలలపాటు ఆయన వీరి ఆకలి తీర్చనున్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 2000మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

రూ.21 లక్షలు అందించిన ఏషియన్‌ గ్రూప్‌

ఏషియన్‌ గ్రూప్‌ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి రూ.21 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కు అందించారు.

చెక్కు అందించిన రాజశేఖర్‌ కుమార్తెలు

టాలీవుడ్‌ నటుడు రాజశేఖర్‌ కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనాపై సమరానికి తమవంతు ఆర్థిక సాయం చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 లక్షలు అందించారు. బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కు అందించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీకి రూ.2 లక్షలు అందించారు.

ఇదీ చదవండి..

ఖననానికి నా కాలేజ్‌ వాడుకోండి: విజయ్‌కాంత్‌

హైదరాబాద్‌ టు చెన్నై.. అజిత్‌ బైక్‌ రైడింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని