లాక్‌డౌన్‌: మన సినీ తారలు ఏం చేస్తున్నారు?

థియేటర్లు లేవు.. షూటింగ్స్‌ లేవు.. ఆడియో ఫంక్షన్‌లు.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లు.. ప్రెస్‌మీట్‌లు లేనే లేవు. లాక్‌డౌన్‌ కారణంగా సినీ తారలందరూ ప్రస్తుతం ఇళ్లలోనే ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా

Updated : 23 Apr 2020 17:18 IST

థియేటర్లు లేవు.. షూటింగ్స్‌ లేవు.. ఆడియో ఫంక్షన్‌లు.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లు.. ప్రెస్‌మీట్‌లు లేనే లేవు. లాక్‌డౌన్‌ కారణంగా సినీ తారలందరూ ప్రస్తుతం ఇళ్లలోనే ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా కరోనాపై కొందరు అవగాహన కల్పిస్తుంటే, మరికొందరు కుటుంబంతో గడుపుతూ, కొత్త కొత్త ఛాలెంజ్‌లను సృష్టిస్తూ, స్వీకరిస్తూ నిత్యం అభిమానులతో దగ్గరగా ఉంటున్నారు. మరి తాజాగా కొందరు తారలు ఏం చేస్తున్నారో చూద్దామా!

పాయల్‌ సరికొత్త ఫ్యాషన్‌..

‘ఆర్‌ఎక్స్‌ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తన హాట్‌ లుక్స్‌తో అలరిస్తుంటుంది. తాజాగా లాక్‌డౌన్‌ వేళ సరికొత్త ఫ్యాషన్‌ దుస్తులను కనిపెట్టే పనిలో పడింది. మొన్న దిండును డ్రెస్‌గా చుట్టుకున్న ఈ భామ, తాజాగా పేపర్‌ను డ్రెస్‌గా వేసుకొని ఆ ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇవి వైరల్‌ అయ్యాయి.

చిట్టి చెల్లెలితో.. సాయిపల్లవి అప్పుడు.. ఇప్పుడు..

 

తన నటనతో యువ హృదయాలను ‘ఫిదా’ చేసిన కథానాయిక సాయి పల్లవి ఇదిగో ఇలా చిన్నప్పటి ఫొటోను పంచుకుంది.

మెగా ఫ్యామిలీ  మేకప్‌

ఈమె ఇప్పుడు బుల్లితెర యాంకర్‌

రష్మిగౌతమ్‌

‘నిధి’లాంటి సందేశం ఇస్తూ..

అజయ్‌దేవగణ్‌ కొత్త బాడీగార్డ్‌ను చూశారా?

చిన్నప్పుడు కియారా అల్లరే అల్లరి..

విలాసంగా పుస్తకం చదువుతూ..

‘ఐ’, ‘2.ఓ’ చిత్రాలతో అలరించిన నటి అమీ జాక్సన్‌ ఇటీవల తల్లి అయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ వేళ ఆ బిడ్డ బాధ్యతలను చూసుకుంటూనే ఇదిగో ఇలా విలాసంగా పుస్తకం చదువుతూ కనిపించింది.

పానీ పూరి చేసిన హంసానందిని

లాక్‌డౌన్‌తో హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. చివరకు పానీ పూరీ కూడా. ఎప్పుడూ బయట పానీ పూరీనే తినాలా? అనుకున్నేమో హంసా నందిని ఇదిగో ఇలా ఇంట్లోనే పానీ పూరి చేసుకుని ఎంచక్కా లాగించేసింది. 

అబ్బాయితో కలిసి చపాతీ చేసిన లాస్య

యాంకర్‌ లాస్య తన కుమారుడు దక్ష్‌తో కలిసి ఇదిగో ఇలా చపాతీ చేశారు.

యోగా చేసిన సుస్మితాసేన్‌ 

ప్రగ్యా.. ప్రకృతి ఒడిలో ఊయలూగుతూ..

సితారతో కలిసి సందడి చేస్తున్న మహేశ్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని