చిన్నారి సావిత్రికి నటకిరిటీ పాఠాలు
పరీక్షాకాలం నుంచే పాఠాలు నేర్చుకోవాలి: రాజేంద్ర ప్రసాద్
హైదరాబాద్: ‘మహానటి’ చిత్రంలో చిన్నారి సావిత్రిగా మెప్పించిన సాయి తేజశ్వినికి నటకిరీటి రాజేంద్రప్రసాద్ జీవిత పాఠాలు నేర్పిస్తున్నారు. దేవుడు పెట్టే ఇలాంటి పరీక్షల నుంచే ప్రతి ఒక్కరూ ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవాలని ఆయన తెలియజేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కామెడీ కింగ్, నటకిరీటిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్లో రాజేంద్రప్రసాద్ రోజువారీ లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో తెలియజేసే విధంగా ఇటీవల ఈటీవీ ఓ వీడియోను రూపొందించి అభిమానులతో పంచుకుంది. యోగా, వాకింగ్‌తో ప్రారంభమయ్యే ఆయన దినచర్య గార్డెనింగ్, వంట చేయడం వంటి పనులతోపాటు చాలా ప్రశాంతంగా సాగుతోంది. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా స్కూల్స్ లేకపోవడంతో ఇంట్లో ఉంటున్న తన మనవరాలు సాయి తేజశ్వినికి ఆయన ఎన్నో విలువైన పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే జీవితం చాలా బాగుంటుందని ఆయన తెలిపారు. రోజు మొత్తంలో ఓ అరగంటపాటు నడవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన వివరించారు. ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటే బోరుకొడుతుందని చెప్పడం మానేసి ఇంటి పనుల్లో మహిళలకు సాయం చేయాలని సూచించారు.
ఇదీ చదవండి
తిండిలేక నీళ్లు తాగి నిద్రపోయేవాళ్లం: బ్రహ్మానందం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi Sanjay: భాజపా-తెరాస కార్యకర్తల ఘర్షణ.. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
-
Sports News
Independence Day : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ.. మెగా ఈవెంట్లలో భారత క్రీడాలోకం ఇలా..!
-
General News
Independence Day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
-
Movies News
Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
-
India News
Indian flag: అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా..!
-
India News
Azadi Ka Amrit Mahotsav: ఆరు ఖండాల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం