కుటుంబంతో ఉండడం సంతోషంగా ఉంది

లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబంతో కలిసి సరదాగా గడపడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు చిన్నారులు. ఎప్పుడూ స్కూల్స్‌, ట్యూషన్స్‌తో విసిగిపోయే చిన్నారులు ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాకుండా వర్క్స్‌ లేకపోవడంతో ...

Updated : 25 Apr 2020 21:11 IST

వీడియో షేర్‌ చేసిన దుల్కర్‌ సల్మాన్‌

చెన్నై: లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబంతో కలిసి సరదాగా గడపడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు చిన్నారులు. ఎప్పుడూ స్కూల్స్‌, ట్యూషన్స్‌తో విసిగిపోయే చిన్నారులు ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాకుండా వర్క్స్‌ లేకపోవడంతో పెద్దవాళ్లు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా రోజురోజూకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో దాని నియంత్రణలో భాగంగా ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం ప్రభుత్వం చెబుతున్న మాటలను పెడచెవిన పెట్టి రోడ్లు మీదకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్‌ వారు కొంతమంది చిన్నారులతో ఓ వీడియోను రూపొందించారు. లాక్‌డౌన్‌లో వాళ్లు ఎలా ఫీల్‌ అవుతున్నారో ఆ వీడియోలో చిన్నారులు తెలియజేశారు. ఇంట్లో వాళ్లతో కలిసి సరదాగా గడపడం చాలా సంతోషంగా ఉందని వాళ్లు పేర్కొన్నారు. ఇంట్లోనే ఉండి కరోనా వైరస్‌ నియంత్రణలో భాగమవుతామని అన్నారు. ఈ వీడియోను ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసి.. చిన్నారులు చెబుతున్న మాటలు వినండి అని పేర్కొన్నారు.

కరోనాని తిన్న రవిబాబు

టాలీవుడ్‌ నటుడు, దర్శకుడు రవిబాబు తాజాగా కరోనా వైరస్‌ను పోలిన ఓ కేక్‌ను తయారు చేసుకుని తిన్నారు. ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం విలయతాడవం చేస్తున్న తరుణంలో దాని నివారణకు దేశవ్యాప్తంగా మార్చి నెల నుంచి లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో లాక్‌డౌన్‌ విధించి నెల రోజులు అవుతున్న నేపథ్యంలో తాజాగా రవిబాబు తన తండ్రి చలపతిరావుతో కలిసి లాక్‌డౌన్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకొన్నారు. చివర్లో కరోనా వైరస్‌ నమూనాని పోలిన విధంగా చేసిన ఓ కేక్‌ను తిన్నారు.

ఇదీ చదవండి

లాక్‌డౌన్‌: మన తారలు ఏం చేస్తున్నారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని