పేద డ్యాన్సర్లకు లారెన్స్‌ సాయం

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కొంతకాలంపాటు లాక్‌డౌన్‌ విధించారు. పనుల్లేక పోవడంతో ఆదాయం లేక ఎందరో పేద కళాకారులు ప్రస్తుతం కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....

Published : 26 Apr 2020 16:14 IST

చెన్నై: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో పనుల్లేక ఎందరో పేద కళాకారులు కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి సాయం చేయడానికి పలువురు తారలు ఇప్పటికే ముందుకు వచ్చారు. తాజాగా నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ పేద డ్యాన్సర్లకు తన వంతు సాయం ప్రకటించారు. 23 మంది డ్యాన్సర్లకు ఆయన రూ.5.75 లక్షలను విరాళంగా అందించారు. ఆయా డ్యాన్సర్ల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.25 వేల చొప్పున డిపాజిట్‌ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో తమకు సాయం చేసిన లారెన్స్‌కు సదరు డ్యాన్సర్లు కృతజ్ఞతలు తెలిపారు.

హార్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘కాంచన’ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవల విడుదలైన ‘కాంచన 3’ సినిమాలో లారెన్స్‌ నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘లక్ష్మిబాంబ్‌’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా ఈసినిమా తెరకెక్కుతోంది. ‘కాంచన’ సినిమాకి హిందీ రీమేక్‌గా ‘లక్ష్మిబాంబ్‌’ రానుంది.

ఇదీ చదవండి

బిల్లా ఆర్టిస్ట్‌కు లారెన్స్‌ సాయం
 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని