దర్శకుడు ఫ్లాట్‌కి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు!

ప్రముఖ దర్శకుడు, కేరళ రాష్ట్ర చలన చిత్ర అకాడమీ ఛైర్మన్‌ కమల్‌ తనను లైంగికంగా వేధించాడని మాలీవుడ్‌ నటి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె కమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తను తెరకెక్కించబోతున్న ‘ప్రణయ మీనుకలుడే కాదల్‌’ సినిమాలో అవకాశం ఇస్తానంటూ....

Published : 26 Apr 2020 20:23 IST

పోలీసులకు నటి ఫిర్యాదు

తిరువనంతపురం: ప్రముఖ దర్శకుడు, కేరళ రాష్ట్ర చలన చిత్ర అకాడమీ ఛైర్మన్‌ కమల్‌ తనను లైంగికంగా వేధించాడని మాలీవుడ్‌ నటి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె కమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ప్రణయ మీనుకలుడే కాదల్‌’ సినిమాలో అవకాశం ఇస్తానంటూ.. దానికి ప్రతిఫలంగా కోరిక తీర్చమన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంజూ వారియర్‌ ప్రధాన పాత్రలో కమల్‌ తెరకెక్కించిన ‘ఆమి’ సినిమా (2018) షూటింగ్‌ సమయంలో ఇదంతా జరిగిందని చెప్పారు. 2019 ఏప్రిల్‌ 26న దర్శకుడికి లీగల్‌ నోటీసు పంపినట్లు పేర్కొన్నారు.

‘‘ఆమి’ సినిమా షూటింగ్‌ సమయంలోనూ నన్ను వేధించాడు. తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించాడు. కమల్ అతడిపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన తోడేలులాంటి వ్యక్తి. అంతేకాదు ఆయన తన సొంత ఇంటిలోనూ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’ అని నటి ఫిర్యాదులో తెలిపారు.

నటి ఆరోపణలపై కమల్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ..‘ఆమెవి ఆధారాలు లేని ఆరోపణలు. గత ఏడాది నాకు లీగల్‌ నోటీసు వచ్చిన మాట వాస్తవమే. ఈ విషయమై నా న్యాయవాదిని సంప్రదించా. అవన్నీ తప్పుడు ఆరోపణలు అయినప్పటికీ.. నటి తదుపరి చర్యలు తీసుకుంటే చట్టబద్ధంగా ముందుకు వెళ్దామని అనుకున్నా. కానీ ఆమె ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేను వదిలిపెట్టేశా. సమాజంలో నాకున్న పేరును దెబ్బతీయాలని తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని నటి ఎందుకు ముందుగానే కనీసం సోషల్‌మీడియాలో బయటపెట్టలేదు. ఆ సినిమా నటీనటులను నేను ఎంపిక చేయలేదు. నా క్యాస్టింగ్‌ టీం ద్వారా యాక్టర్స్‌ను ఎంచుకున్నా’ అని ఆయన అన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని