నాకు బాయ్‌ఫ్రెండ్ లేరు: నిధి అగర్వాల్
ప్రస్తుతానికి తనకి బాయ్ ఫ్రెండ్ లేరని నటి నిధి అగర్వాల్ తెలిపారు. గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌శంకర్’ చిత్రంతో నిధి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో ఆమె రామ్ సరసన ఆడిపాడింది. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న ‘భూమి’ చిత్రంలో నిధి నటిస్తున్నారు....
ఏంజెల్స్‌ను నమ్ముతాను
హైదరాబాద్: ప్రస్తుతానికి తనకి బాయ్ ఫ్రెండ్ లేరని నటి నిధి అగర్వాల్ అంటున్నారు. గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌శంకర్’ చిత్రంతో నిధి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న ‘భూమి’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. జయం రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణాంతర పనులు ముగించుకుని మే 8న విడుదల కావాల్సి ఉంది. అయితే దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన నిధి తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
‘లాక్‌డౌన్ వల్ల మీరందరూ ఏం చేస్తున్నారు. నేను మాత్రం ఇంట్లోనే ఉంటున్నాను’ అని పేర్కొంటూ నిధి అగర్వాల్ అభిమానులతో ఛాట్ చేశారు. కాగా ఓ అభిమాని ‘మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?’ అని ప్రశ్నించగా.. ‘బెంగళూరులోని మా నివాసంలో ఉన్నాను’ అని నిధి తెలిపారు. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన ఫోన్ స్ర్కీన్‌లాక్ ఫొటోను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ.. ‘నేను ఏంజెల్స్‌ను నమ్ముతాను’ అని అన్నారు. అనంతరం మరో అభిమాని.. ‘మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా?’ అని ప్రశ్నించగా.. ‘నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు. అలాగే ఎలాంటి రిలేషన్‌లో కూడా లేను’ అని బదులిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్