నాని చెప్పనున్న చిరు సినిమా విశేషాలు

అగ్రకథానాయకుడు చిరంజీవి చిత్రానికి సంబంధించిన విశేషాలను యువ కథానాయకుడు నాని బయటపెట్టనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్‌ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. శ్రీదేవి కథానాయిక....

Published : 04 May 2020 11:54 IST

‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి 30 యేళ్లు

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు చిరంజీవి చిత్రానికి సంబంధించిన విశేషాలను యువ కథానాయకుడు నాని వెల్లడించనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్‌ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. శ్రీదేవి కథానాయిక. 1990లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సూపర్‌ హిట్‌ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. 

కాగా, మే9 నాటికి ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఓ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. ‘జగదేకవీరుడు...’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ బయటకురాని ఎన్నో ఆసక్తికర విశేషాలను నానితో చెప్పించనున్నారు. ఈ మేరకు నాని మే 5, 7, 9 తేదీల్లో ఈ చిత్రానికి సంబంధించిన మూడు ఆసక్తికర విశేషాలను బయట పెట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని