‘ఆకలి’కి వ్యాక్సిన్‌ కనిపెట్టాలి: విజయ్‌ సేతుపతి

ముందుగా ‘ఆకలి’కి ఓ వ్యాక్సిన్‌ కనిపెడితే ఎంత బాగుంటుందని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. వేదికలపై చర్చనీయాంశమైన

Published : 06 May 2020 08:52 IST

చెన్నై: ముందుగా ‘ఆకలి’కి ఓ వ్యాక్సిన్‌ కనిపెడితే ఎంత బాగుంటుందని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. వేదికలపై చర్చనీయాంశమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి అందరి దృష్టిని ఆకట్టుకుంటారు విజయ్‌ సేతుపతి. ఇటీవల కూడా కరోనాను కట్టడి చేసేందుకు దేవుడు దిగిరాడని, మనమే ఐక్యంగా ఉంటూ సహకరించుకోవాలని చెప్పారు.

అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తప్పులను కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్‌లో ‘ఆకలి అనే వ్యాధి ఉంది. అందుకు వ్యాక్సిన్‌ కనుక్కుంటే ఎంత బాగుంటుంది.  ఓ మై కడవుళే’ అని పేర్కొన్నారు.

విజయ్‌సేతుపతి తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఆయన ‘సైరా’లో నటించగా, త్వరలో ‘ఉప్పెన’ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని