ఆ సినిమా పరాజయం నాకో పెద్ద దెబ్బ..!

ఒకానొక సమయంలో తాను కథానాయికగా నటించిన ఓ బాలీవుడ్‌ సినిమా పరాజయమైందని.. అప్పట్లో అది తనకో పెద్ద దెబ్బ అని నటి తమన్నా అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి విశ్రాంతి దొరకడంతో ఇంటికే పరిమితమైన...

Updated : 27 Dec 2022 18:33 IST

తమన్నా

హైదరాబాద్‌: ఒకానొక సమయంలో తాను కథానాయికగా నటించిన ఓ బాలీవుడ్‌ సినిమా పరాజయమైందని.. అప్పట్లో అది తనకో పెద్ద దెబ్బ అని నటి తమన్నా అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి విశ్రాంతి దొరకడంతో ఇంటికే పరిమితమైన తమన్నాను తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియా వారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా తమన్నా బాలీవుడ్‌లో తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

‘కథానాయికగా నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన చిత్రం ‘హిమ్మత్‌వాలా’. బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. ఆ సినిమా పరాజయం కెరీర్‌పరంగా నాకో పెద్ద. అంతేకాకుండా నా జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం కూడా అదే. అయితే ఆ సినిమా పరాజయం చెందిన సమయంలో నేను వేర్వేరు ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. వరుస షూటింగ్స్‌ కారణంగా నేను బాలీవుడ్‌ సినిమా పరాజయం గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఒకేసారి 4-5 సినిమాల్లో పనిచేయడం వల్ల ఈ సినిమా విజయం సాధించలేదు లేదా ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యింది అనే విషయాన్ని కూడా నేను ఆలోచించలేకపోయేదాన్ని. అయినా సరే ఆ సినిమా పరాజయం అనేది ఏదో ఒక రకంగా మంచికే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలని అర్థమైంది.’ అని తమన్నా తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు