అందుకే రజనీ ఖైదీ నం. 165..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేట’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది...

Updated : 08 May 2020 12:55 IST

‘పేట’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేట’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్‌ స్టైల్‌, మేనరిజమ్స్‌తోపాటు త్రిష, సిమ్రన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన మూడు ఆసక్తికర విషయాలను తాజాగా సన్‌ పిక్చర్స్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

అందుకే ఖైదీ నం: 165:

‘పేట’ చిత్రంలోని ఓ సన్నివేశంలో రజనీకాంత్‌ను జైలులో పెడతారు. దుస్తులపై ఖైదీ నం.165 అని ఉంటుంది. అందుకు కారణమేమిటంటే.. ‘పేట’ చిత్రం రజనీకాంత్‌ 165వ సినిమా.

ఫైట్‌ కోసం 50 రోజులు ట్రైనింగ్‌

NUNCHAKU ఫైట్‌ సీన్‌ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫైట్‌ కోసం రజనీ‌ 50 రోజులపాటు ట్రైనింగ్‌ తీసుకున్నారు.

‘బాబా’ తర్వాత ‘పేట’లోనే..

2002లో విడుదలైన ‘బాబా’ సినిమా తర్వాత ‘పేట’ చిత్రంలోనే ‘సూపర్‌స్టార్‌ రజనీ’ అనే ఒరిజినల్‌ గ్రాఫిక్‌ టైటిల్‌ కార్డును ఉపయోగించారు. అలాగే 1997లో విడుదలైన ‘అరుణాచలం’ సినిమా తర్వాత ఈ సినిమాలోనే ఒరిజినల్‌ గ్రాఫిక్‌ టైటిల్‌ కార్డుకు అనుగుణంగా ఒరిజినల్‌ సౌండ్‌ట్రాక్‌ను ఉపయోగించారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని