2020లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో..

ఈ ఏడాదిలో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో అని అంటున్నారు కథానాయకుడు నాని. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న రానాని ఉద్దేశిస్తూ తాజాగా నాని ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. మంగళవారం సాయంత్రం రానా తనకి కాబోయే

Updated : 13 May 2020 12:39 IST

ట్విటర్‌ వేదికగా నాని ఏమన్నారంటే

హైదరాబాద్‌: ఈ ఏడాదిలో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో అని అంటున్నారు కథానాయకుడు నాని. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న రానాని ఉద్దేశిస్తూ తాజాగా నాని ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. తనకి కాబోయే సతీమణి మిహీకా బజాజ్‌తో దిగిన ఓ ఫొటోను రానా షేర్‌ చేస్తూ.. ‘తను నాకు ఓకే చెప్పేసింది’ అని ట్వీట్‌ పెట్టి అందర్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో పలువురు సినీ తారలు రానాకి శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, మంచులక్ష్మి, సుధీర్‌బాబు, నవీన్‌ చంద్రా, శోభూ యార్లగడ్డ.. జీవితంలోని సరికొత్త అంకంలోకి స్వాగతం అని పేర్కొంటూ ట్వీట్లు పెట్టిన విషయం తెలిసిందే.

కాగా, నాని మాత్రం కాస్త విభిన్నంగా రానాకి శుభాకాంక్షలు తెలిపారు. రానా పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘2020లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో..! ఈ సంతోషకరమైన సమయంలో ఈ పాటను నీకు అంకితం చేస్తున్నాను. జోక్స్‌ అన్ని పక్కన పెడితే.. సూపర్‌ హ్యాపీ బాబాయ్‌’ అని నాని పేర్కొన్నారు. మరోవైపు అనుష్క సైతం ఇన్‌స్టా వేదికగా రానాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘కంగ్రాట్స్‌ బ్రో, మిహీకా బజాజ్‌. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అనుష్క అన్నారు. ఇదిలా ఉండగా రానా, మిహీకాలకు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

 










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని