వీడియో కాల్‌ ద్వారా సమంత జిమ్‌ పాఠాలు

అగ్ర కథానాయిక సమంత ఇంట్లో ఉంటూనే తెగ కసరత్తులు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వీడియో కాల్‌ ద్వారా ట్రైనర్‌ సందీప్‌ రాజ్‌ సూచనలు తీసుకుని ఫిట్‌గా తయారౌతున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ అలుపులేకుండా....

Published : 13 May 2020 22:13 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత ఇంట్లో ఉంటూనే తెగ కసరత్తులు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వీడియో కాల్‌ ద్వారా ట్రైనర్‌ సందీప్‌ రాజ్‌ సూచనలు తీసుకుని ఫిట్‌గా తయారౌతున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ అలుపులేకుండా అంకితభావంతో కసరత్తులు చేస్తున్న ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అంతేకాదు హోమ్‌ క్వారంటైన్‌లో సామ్‌ ఆన్‌లైన్‌ క్లాస్‌లు కూడా తీసుకుంటున్నారు. మెరుగైన నటిగా అందరి ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం చైతన్యతో కలిసి కారులో బయటికి వెళ్లిన ఫొటోను సామ్‌ షేర్‌ చేశారు. ‘జాను’ సినిమాతో సమంత ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సామ్ త్వరలో ‘ది ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2లో కనిపించనున్నారు. అదేవిధంగా తమిళంలో రెండు ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు సమాచారం. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని