వచ్చే ఏడాదిలో నిహారిక వివాహం..!

వచ్చే ఏడాదిలో తన కుమార్తె నిహారికకు వివాహం చేయాలనే ఆలోచనలో తాము ఉన్నామని నటుడు నాగబాబు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి కొంత ఉపశమనం దొరకడంతో కొత్త విషయాలను...

Published : 15 May 2020 09:05 IST

సంబంధాలు చూస్తున్నాం: నాగబాబు

హైదరాబాద్‌: వచ్చే ఏడాదిలో తన కుమార్తె నిహారికకు వివాహం చేయాలనే ఆలోచనలో ఉన్నామని నటుడు నాగబాబు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి కొంత ఉపశమనం దొరకడంతో కొత్త విషయాలను తెలుసుకునే పనిలో ఆయన ఉన్నారు. ఇటీవల నాగబాబును ఓ ఛానెల్‌ వారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయగా ఆయన ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వం చెబుతున్న నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు.

అనంతరం తన కుమార్తె నిహారిక, కుమారుడు వరుణ్‌ తేజ్‌ వివాహాల గురించి నాగబాబు స్పందించారు. ‘వచ్చే ఏడాది ఆరంభంలో నా కుమార్తె నిహారిక వివాహం చేయాలని మేము అనుకుంటున్నాం. తనకి తగిన వరుడి కోసం సంబంధాలు చూస్తున్నాం. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో పెళ్లి జరిపించాలని భావిస్తున్నాం. అలాగే వరుణ్‌ తేజ్‌ పెళ్లి గురించి కూడా ఆలోచిస్తున్నాం. వాళ్లిద్దరి పెళ్లిళ్లు అయితే నేను ఫ్రీ అవుతాను.’ అని నాగబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని