రామ్‌.. నీ ప్రేమను మిస్‌ అవుతున్నా: ఛార్మి

రామ్‌ ఎనర్జీని, ప్రేమను తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని నటి, నిర్మాత ఛార్మి అన్నారు. శుక్రవారం రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఛార్మి ఆయనకు ట్విటర్‌ వేదికగా విషెస్‌ తెలిపారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ షూటింగ్‌ సమయంలో...

Published : 15 May 2020 14:43 IST

వీడియో షేర్‌ చేసిన బర్త్‌డే బాయ్‌

హైదరాబాద్‌: రామ్‌ ఎనర్జీని, ప్రేమను తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని నటి, నిర్మాత ఛార్మి అన్నారు. శుక్రవారం రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఛార్మి ఆయనకు ట్విటర్‌ వేదికగా విషెస్‌ తెలిపారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ షూటింగ్‌ సమయంలో రామ్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘ఉస్తాద్‌ రామ్‌.. గతేడాది ఇదే రోజున మనం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంలోని ‘జిందాబాద్‌’ సాంగ్‌ షూటింగ్‌ కోసం గోవాలో ఉన్నాం. ఆ సమయంలో బాగా పార్టీ చేసుకున్నాం. కానీ ఈ ఏడాది నీ ఎనర్జీని, ప్రేమను ఎంతో మిస్‌ అవుతున్నాను. లాక్‌డౌన్‌ అయ్యాక నిన్ను కలవాలనుకుంటున్నాను. లవ్‌ యూ’ అని ఛార్మి పేర్కొన్నారు. మరోవైపు నభానటేశ్‌ సైతం గతేడాది రామ్‌ పుట్టినరోజు వేడుకలను గుర్తుచేసుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌. ఈ ఏడాది అంతా నీకు సూపర్‌ డూపర్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. గతేడాది నీ పుట్టినరోజున సాంగ్‌ షూటింగ్‌, బర్త్‌డే పార్టీ ఎంతో ఫన్‌గా జరిగాయి కదా..!’ అని ట్వీట్‌ చేశారు.

గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో రామ్‌ ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌కు జంటగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ నటించారు. ఛార్మి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విజయం తర్వాత రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. పుట్టినరోజు సందర్భంగా ‘రెడ్‌’ సినిమా నుంచి ఓ పాట టీజర్‌ను రామ్‌ అభిమానులతో పంచుకున్నారు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని