కాలం మారినా.. సేమ్‌ టు సేమ్‌: చిరు

కాలం మారినా.. దేశం మారినా.. తమ దంపతుల్లో ఎటువంటి మార్పు లేదని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. సోమవారం ఆయన పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. ముప్పై ఏళ్ల క్రితం అమెరికా ట్రిప్‌కు వెళ్లినప్పుడు భార్యతో తీసుకున్న ఫొటోను.. ఇప్పుడు లాక్‌డౌన్‌లో క్లిక్‌ మనిపించిన......

Updated : 18 May 2020 17:54 IST

హైదరాబాద్‌: కాలం మారినా.. దేశం మారినా.. తమ దంపతుల్లో ఎటువంటి మార్పు లేదని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. సోమవారం ఆయన పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. ముప్పై ఏళ్ల క్రితం అమెరికా ట్రిప్‌కు వెళ్లినప్పుడు భార్యతో తీసుకున్న ఫొటోను.. ఇప్పుడు లాక్‌డౌన్‌లో క్లిక్‌ మనిపించిన చిత్రాన్ని జత చేసి పంచుకున్నారు. 1990లో అమెరికాలో ఆనందమైన హాలిడేస్‌ను గడిపితే.. ఇప్పుడు 2020లో కరోనా ‘జైల్‌’ఫుల్‌ హాలిడేస్‌ను గడుపుతున్నానని పేర్కొన్నారు. ‘తాను.. నేను.. కాలం మారినా.. దేశం మారినా..’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

30 ఏళ్ల తర్వాత తీసిన ఫొటోలోనూ.. చిరు, సురేఖ 1990 ఫొటోలోని పోజులో కనిపించడం విశేషం. అంతేకాదు అలాంటి దుస్తుల్నే ధరించారు. చూడచక్కగా ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ‘కపుల్‌ గోల్స్‌.. అత్తయ్య, మామయ్య’ అని ఈ ఫొటోకు చిరు అల్లుడు, హీరో కల్యాణ్‌దేవ్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ఆదర్శ దంపతులు, వావ్‌, మీ టైమింగ్‌ బాగుంది..’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. చిరు ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని