ఎన్టీఆర్‌ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌ నేనిస్తా!

కథానాయకుడు ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మే 20న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయాలని భావించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయడానికి వీలులేకపోవడంతో టీజర్‌ రూపొందించడం కష్టంగా మారింది. దీనిపై తారక్‌ వివరణ కూడా ఇచ్చారు....

Published : 19 May 2020 16:33 IST

ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: కథానాయకుడు ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మే 20న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయాలని భావించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయడానికి వీలులేకపోవడంతో టీజర్‌ రూపొందించడం కష్టంగా మారింది. దీనిపై తారక్‌ వివరణ కూడా ఇచ్చారు. యూనిట్‌ సభ్యులు చాలా కష్టపడ్డారని, కుదరలేదని చెప్పారు. పుట్టినరోజు వేడుకలు జరపొద్దని, అందరూ భౌతికదూరం పాటించాలని కోరారు. దీంతో నిరాశ చెందిన అభిమానుల్లో.. తారక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ కాస్త ఉత్సాహం నింపారు. ‘బుధవారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానుల కోసం నా వద్ద ప్రత్యేకమైంది ఉంది. నా ట్విటర్‌లో దాన్ని మీతో షేర్‌ చేసుకోబోతున్నా’ అని ట్వీట్‌ చేశారు.

‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్స్‌ నుంచి..

‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1కు వ్యాఖ్యాతగా వ్యవహరించి తారక్‌ బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన జన్మదినం సందర్భంగా ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1 హౌస్‌మేట్స్‌ అంతా కలిసి ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. దీన్ని రేపు ఉదయం 9.30 గంటలకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ విడుదల చేయబోతున్నారు. మరోపక్క యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ కూడా తారక్‌కు అంకితం ఇస్తూ ఓ పాటను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు దీన్ని షేర్‌ చేయబోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని