నాకొక మంచి పేరు చెప్పండి..?

తనకి ఏ పేరు సూట్‌ అవుతుందో చెప్పమని క్యూటీ బ్యూటీ రష్మిక నెటిజన్లను సరదాగా కోరారు. సోషల్‌మీడియా వేదికగా తరచూ అభిమానులతో చేరువగా ఉండే రష్మిక లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి తనకు సంబంధించిన...

Updated : 21 May 2020 09:55 IST

అభిమానులను కోరిన రష్మిక

హైదరాబాద్‌: తనకి ఏ పేరు సూట్‌ అవుతుందో చెప్పమని క్యూటీ బ్యూటీ రష్మిక నెటిజన్లను సరదాగా కోరారు. సోషల్‌మీడియా వేదికగా తరచూ అభిమానులతో చేరువగా ఉండే రష్మిక లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇటీవల #UntoldRashmika పేరుతో తన లైఫ్‌లో జరిగిన ఎన్నో సరదా సంగతులను ఆమె అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా రష్మిక నెటిజన్లకు సరదా ప్రశ్న విసిరారు. ‘ఒకవేళ నేను పేరు మార్చుకోవాల్సి వస్తే.. అది ఏమై ఉండాలని మీరు కోరుకుంటున్నారు? కొంచెం మంచిగా ఆలోచించి చెప్పండి’ అని రష్మిక ట్వీట్‌ చేశారు. అయితే రష్మిక పెట్టిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘మేడమ్‌.. మీకు లిల్లీ(డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలోని పాత్రపేరు) అనే పేరు బాగుంటుంది’ అని కొందరు చెబుతున్నారు. ‘తలా రష్మిక’, ‘మోనీ’, ‘రష్మిక విజయ్ దేవరకొండ’ అని మరికొంతమంది సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా.. ‘మీకు రష్మిక అనే పేరు బాగా నప్పుతుంది. వేరే పేర్లు కంటే మీకు మీపేరు బాగుంటుంది’ అని ఇంకొంతమంది రిప్లై ఇచ్చారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో రష్మిక నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రానున్న ‘పుష్ప’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని