కాబోయే సతీమణితో రానా.. ఫొటోలు వైరల్‌..!

అగ్రకథానాయకుడు రానా, తనకు కాబోయే సతీమణి మిహీకా బజాజ్‌తో దిగిన రెండు ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘ఇప్పుడు ఇక అధికారికం’ అని పేర్కొన్నారు. దీంతో రానా షేర్‌ చేసిన ఫొటోలపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు...

Updated : 21 May 2020 14:26 IST

హైదరాబాద్‌: నటుడు రానా, తనకు కాబోయే సతీమణి మిహికా బజాజ్‌తో దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ఇప్పుడు ఇక అధికారికం’ అని పేర్కొన్నారు. దీంతో రానా షేర్‌ చేసిన ఫొటోలపై అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. వరుణ్‌ తేజ్‌, శివ కార్తికేయన్‌, సైనా నెహ్వాల్‌, అనసూయ.. ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘చూడముచ్చటైన జంట. మీ జీవితం మరెంతో సంతోషంగా ఉండాలి’ అని పేర్కొంటూ ట్వీట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మే నెల ఆరంభంలో తాను మిహికాతో ప్రేమలో ఉన్నానని ప్రకటించి రానా అందర్నీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ‘తను నాకు అంగీకారం తెలిపింది (లవ్‌ సింబల్‌ ఎమోజీ)’ అని తెలియజేస్తూ రానా మొదటిసారి తన ప్రేయసి మిహికాను సోషల్‌మీడియా వేదికగా అందరికీ పరిచయం చేశారు.

కాగా, ఇరు కుటుంబాల పెద్దలు బుధవారం హైదరాబాద్‌లో కలుసుకున్నారు. రానా-మిహికాల నిశ్చితార్థం, పెళ్లి పనుల గురించి చర్చించుకున్నాయి. అయితే ఈ ఏడాదిలో వీరి వివాహం జరగనుందని ఇటీవల సురేశ్‌బాబు సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు కుటుంబాల పెద్దలు కలవడంతో వీరి పెళ్లి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

ఇవీ చదవండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని