రానాపై ప్రేమను బయటపెట్టిన మిహికా..!

అగ్రకథానాయకుడు రానాపై తనకున్న ప్రేమను మొదటిసారి బయటపెట్టారు ఆయనకు కాబోయే సతీమణి మిహికా బజాజ్‌. మే నెల ఆరంభంలో మిహికాతో దిగిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన రానా..

Updated : 08 Dec 2022 16:30 IST

మై హ్యాపీ ప్లేస్‌ @ రానా

హైదరాబాద్‌: రానాపై తనకున్న ప్రేమను తొలిసారి బయటపెట్టారు ఆయనకు కాబోయే సతీమణి మిహికా బజాజ్‌. తాజాగా రానా, మిహికాల ‘రోకా’ వేడుకగా హైదరాబాద్‌లో సందడిగా జరిగింది. ఉత్తరాది సంప్రదాయాల్లో ఘనంగా జరుపుకొనే ఈ వేడుకలో వరుడు, వధువు కుటుంబాలకు చెందిన పెద్దలు ఒకచోట కలుసుకుని పెళ్లి పనులు, నిశ్చితార్థం గురించి చర్చించుకుంటారు. అయితే బుధవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను రానా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘ఇక మా బంధం అధికారికమైంది’ అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మిహికా సైతం తనకు కాబోయే భర్త రానాతో దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా మొదటిసారి షేర్‌ చేశారు. ‘నా ప్రియమైన రానాతో కలిసి జీవితం ప్రారంభం’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. రానాతో నవ్వులు పూయిస్తున్న మరో ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మై హ్యాపీ ప్లేస్‌ @ రానా‌’ అని తెలిపారు. మిహికా పెట్టిన పోస్టులు చూసిన సినీ ప్రముఖులు, బజాజ్‌ కుటుంబసభ్యులు, నెటిజన్లు సంతోషించారు. ‘కంగ్రాట్స్‌ మిరా (మిహికా+రానా)’, ‘లవ్లీ కపుల్‌’, ‘చూడముచ్చటైన జంట’, ‘మీ కథ ఎంతో మధురమైనది. మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. బజాజ్‌ కుటుంబంలోకి రానాకు స్వాగతం’ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చదవండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని