రాఘవేంద్రరావుపై స్పెషల్‌ వీడియో చూశారా..!

ఎన్నో మధురమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి మంచి విజయాలను సొంతం చేసుకున్న వ్యక్తి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా వైజయంతీ మూవీస్‌ నిర్మాణ సంస్థ...

Updated : 23 May 2020 20:13 IST

దర్శకేంద్రుడికి శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: ఎన్నో మధురమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి మంచి విజయాలను సొంతం చేసుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా వైజయంతీ మూవీస్‌ నిర్మాణ సంస్థ ఓ ప్రత్యేక వీడియో రూపొందించింది. రాఘవేంద్రరావుతో అశ్వనీదత్‌కు ఉన్న అనుబంధాన్ని గురించి వివరిస్తూ రూపొందిన ఈ వీడియోకి దర్శకుడు క్రిష్‌ వాయిస్‌ ఓవర్‌ను అందించారు.

‘వైజయంతి వైభవానికి మూలస్తంభాలుగా నిలిచిన ఎందరో మహానుభావులు. అందులో మొదటి వరుసలో నిలిచే పేరు, వైజయంతికి అత్యధిక సినిమాలు డైరెక్ట్‌ చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు. అశ్వనీదత్‌-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమాకు ఆయనే ‘ఎదురు లేని మనిషి’ టైటిల్‌ సూచించారు. అలా ప్రారంభమైన వీరి ప్రయాణంలో 14 సినిమాలు రూపొందాయి.’ అని క్రిష్‌ పేర్కొన్నారు. వైజయంతి మూవీస్‌తోపాటు మరికొంతమంది సినీ ప్రముఖులు సైతం దర్శకేంద్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘హ్యాపీ బర్త్‌డే మామయ్య. నీలాంటి తెలివైన దర్శకుడితో పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మంచి ఆరోగ్యం, ఆనందం మీ సొంతం కావాలని కోరుకుంటున్నాను’ - మహేశ్‌బాబు

‘రొమాంటిక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది సెంచరీ రాఘవేంద్రరావుకి హ్యాపీ బర్త్‌డే. మీ నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నాం. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ - పూరీ జగన్నాథ్‌

‘లెజండరీ డైరెక్టర్‌, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండాలని ఆశిస్తున్నాను’ - పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ


 





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని