వరుణ్‌తేజ్‌కు హ్యాండ్‌ ఇచ్చిన రానా, నితిన్‌

యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ వివాహం త్వరలో జరగబోతోందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూట్యూబ్‌లో వచ్చిన వీడియోను స్క్రీన్‌షాట్‌ తీసిన కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఏంటి బావా(వరుణ్‌ను ఉద్దేశిస్తూ).. నీకు పెళ్లంట?’ అని ఆశ్చర్యపోతున్న....

Published : 23 May 2020 17:13 IST

‘నాతోనే ఉంటానంటూ ఇలా చేశారు’

హైదరాబాద్‌: యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ వివాహం త్వరలో జరగబోతోందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూట్యూబ్‌లో వచ్చిన వీడియోను స్క్రీన్‌షాట్‌ తీసిన కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఏంటి బావా(వరుణ్‌ను ఉద్దేశిస్తూ).. నీకు పెళ్లంట?’ అని ఆశ్చర్యపోతున్న ఎమోజీలను షేర్‌ చేశారు. దీనికి వరుణ్‌తేజ్‌ రిప్లై ఇచ్చారు. ‘దానికి (వివాహానికి) చాలా సమయం ఉందిలే కానీ.. మన రానా, నితిన్‌ మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటామంటూనే సింపుల్‌గా సింగిల్‌ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయిపోయారు’ అని పేర్కొన్నారు.

వరుణ్‌ ట్వీట్‌కు నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘అది నిజమే..’ అంటూ మద్దతు తెలిపారు. దీనిపై రానా, నితిన్‌ ఇంకా కామెంట్‌ చేయలేదు. రానా ఈ ఏడాదిలో తన ప్రియురాలు మిహికా బజాన్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల ‘రోకా’తో వీరిద్దరి పెళ్లి సందడి మొదలైంది. డిసెంబరులోపు  రానా వివాహం జరుగుతుందని ఆయన తండ్రి సురేశ్‌బాబు చెప్పారు. ఇటీవల నితిన్‌కు తన ప్రేయసి షాలినితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్‌లో దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. మరోపక్క కథానాయకుడు నిఖిల్‌ లాక్‌డౌన్ సమయంలోనే ఓ ఇంటివారయ్యారు. తన ప్రేయసి పల్లవి వర్మను మనువాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తొలుత వివాహం వాయిదా వేసుకున్న నిఖిల్‌.. చివరికి  తక్కువ మంది అతిథుల సమక్షంలో ప్రభుత్వ నిబంధల్ని పాటించి, పెళ్లి చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని