
సంగీత్‌లో పూజాహెగ్డే సందడి..!
ఫొటోలు షేర్ చేసిన నటి
హైదరాబాద్: బుట్టబొమ్మ పూజాహెగ్డే సంగీత్‌లో సందడి చేశారు. చేతికి మెహందీ పెట్టుకుని వధువుగా ముస్తాబై చూపరులను ఆకట్టుకున్నారు. బంగారు వర్ణపు దుస్తుల్లో మెరిసిపోయారు. కానీ ఇది నిజ జీవితంలో కాదండి.. ఓ సినిమాలో మాత్రమే..!! లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ మిస్ అవుతోన్న పూజా.. వివిధ సెట్స్‌లో పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా పూజాహెగ్డే.. తాను నటించిన ‘హౌస్‌ఫుల్-4’ చిత్రానికి సంబంధించిన రెండు స్టిల్స్‌ను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆమె పెళ్లికూతురి గెటప్‌లో కనిపించారు. ‘‘హౌస్‌ఫుల్-4’ చిత్రానికి సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం. సంగీత్ డ్రెస్‌లో ఇలా..’ అని పేర్కొన్నారు. పూజా షేర్ చేసిన ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘వావ్, పూజా.. మీరు చాలా అందంగా ఉన్నారు, క్యూటీ’ అని కామెంట్లు చేస్తున్నారు.
‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే పూజా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రంలో పూజా కథానాయికగా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరిగింది. దీనికి ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో పూజా హీరోయిన్‌గా సందడి చేయనున్నారు.