14 వేల సినీ కుటుంబాలకు తలసాని సాయం

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ 14 వేల సినీ, టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం చేయబోతున్నారు. కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధిలేక సతమతమౌతున్న వీరి ఆకలి తీర్చేందుకు ప్రముఖ..

Published : 26 May 2020 14:44 IST

హైదరాబాద్‌: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ 14 వేల సినీ, టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం చేయబోతున్నారు. కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధిలేక సతమతమౌతున్న వీరి ఆకలి తీర్చేందుకు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఇప్పటికే ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా విరాళాలు సేకరించి, సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

కాగా ఇప్పుడు సినీ, టీవీ కార్మికుల కోసం తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముందుకొచ్చారు. వారికి నిత్యావసరాలు పంపిణీ చేయబోతున్నారు. అవ‌స‌రం మేర పెద్దల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుని మంత్రి ఈ సేవా కార్యక్రమానికి శ్రీ‌కారం చుడుతున్నారు. గురువారం మొద‌లు 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలు అందే వరకూ.. ఈ సేవా కార్యక్రమం కొన‌సాగ‌నుంద‌ని మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని