Published : 27/05/2020 16:39 IST

సినీ రంగాన్ని ఆదుకుంటాం: మంత్రి తలసాని

హైదరాబాద్‌: సినిమా షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి సమావేశమయ్యారు. నిర్మాతలు సి. కల్యాణ్‌, దిల్‌రాజు, దర్శకుడు ఎన్‌. శంకర్‌, మా అధ్యక్షుడు నరేష్‌, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌ రాంమోహన్‌రావు, జీవిత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘సినీ రంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. లాక్‌డౌన్‌తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లు నిలిచిపోయి.. ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్‌లకు సంబంధించి తగు నిర్ణయాలు తీసుకుంటాం’ అని అన్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ ప్రముఖులు కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 28న మధ్యాహ్నం 3 గంటలకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించబోతున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని