14వేల మంది సినీ కార్మికుల‌ కుటుంబాల కోసం..

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణలు వాయిదా పడటంతో ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న సినీ-టీవీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి

Updated : 28 May 2020 15:31 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణలు వాయిదా పడటంతో ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న సినీ-టీవీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్,  తలసాని సాయికిరణ్ యాదవ్  ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం చేసే కార్యక్రమాన్ని గురువారం ప్రాంరంభించారు.

అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, త్రివిక్రమ్‌, దిల్‌రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్మోహనరావు, తలసాని సాయి, ఎన్‌.శంకర్‌, సి.కల్యాణ్‌, అభిషేక్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా పలువురు సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని