‘అ ఆ’ సినిమా వదులుకున్నా..!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘జులాయి’ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి కల్పికా గణేశ్‌. తాజాగా ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. తన సినీ కెరీర్‌, ఇష్టమైన కోస్టార్‌....

Updated : 07 Dec 2022 17:04 IST

కల్పికా గణేశ్‌

హైదరాబాద్‌: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘జులాయి’ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి కల్పికా గణేశ్‌. తాజాగా ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. తన సినీ కెరీర్‌, ఇష్టమైన కోస్టార్‌ గురించి నెటిజన్లకు తెలిపారు. ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘జులాయి’ చిత్రాలు నాకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఆ రెండు చిత్రాల్లో  నా పాత్ర చిన్నదే అయినప్పటికీ ప్రేక్షకులను అలరించింది. ఆ రెండు సినిమాల తర్వాత నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఆ’ సినిమాలో నితిన్‌ సోదరి పాత్రకు నన్ను అడిగారు. నాకు కూడా ఆ రోల్‌ బాగా నచ్చింది. కాకపోతే అదే సమయంలో నేను వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ‘అఆ’ ఆఫర్‌ వదులుకోవాల్సి వచ్చింది. చిన్నసినిమాగా తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రంలో ముస్లిం అమ్మాయి పాత్ర చేయమని అడిగారు. వేరే సినిమాల వల్ల దానిని కూడా వదులుకున్నాను’ అని కల్పిక తెలిపారు. 

‘ఇప్పటివరకూ నేను నటించిన సినిమాల్లోని హీరోహీరోయిన్లంటే నాకు అభిమానం ఉంది. శర్వానంద్‌, మహేశ్‌బాబు, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌, సాయిపల్లవి, సమంత మంచి కోస్టార్స్‌. వాళ్లతో వర్క్‌ చేయడం చాలా సరదాగా ఉంటుంది. వర్క్‌ని బాగా ఎంజాయ్‌ చేయొచ్చు’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని