పెళ్లిరోజు చాలా కంగారుపడ్డా: మంచు లక్ష్మి

కథానాయిక మంచు లక్ష్మి తన పెళ్లి రోజున చాలా కంగారుపడ్డారట. శుక్రవారం ఆమె తన పెళ్లి రోజు జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. తన వివాహం సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి కుమార్తెగా సిద్ధమై.. వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత తొలి గంటసేపు బిడియంగా....

Updated : 29 May 2020 14:25 IST

పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న నటి మంచు లక్ష్మి తన పెళ్లి ఆల్బమ్‌ను తిరగేశారు. పెళ్లి రోజు జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. తన వివాహం సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని ఇన్‌స్టా‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి రోజున చాలా కంగారుపడ్డానని పేర్కొన్నారు. పెళ్లి కుమార్తెగా సిద్ధమై.. వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత తొలి గంట బిడియంగా అనిపించిందని, బయటికి వెళ్లే దారి కోసం సీరియస్‌గా వెతికానని అన్నారు. అదేవిధంగా పెళ్లి కూతురు ఫంక్షన్‌లో తండ్రి మోహన్‌బాబుతో దిగిన మరో ఫొటోను కూడా పంచుకున్నారు.

మంచు లక్ష్మి 2006లో ఆండీ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల కుమార్తె విద్యా నిర్వాణ. సరోగసీ పద్ధతి ద్వారా మంచు లక్ష్మి తల్లి అయిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంచు లక్ష్మి సినీ, విద్య, వైద్య తదితర రంగాలకు చెందిన ప్రముఖులతో ఇన్‌స్టా‌ వేదికగా లైవ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. శుక్రవారం ‘విద్య భవిష్యత్తు ఏంటి?’ అనే అంశంపై విద్యావేత్త అంజుమ్‌ బాబు ఖాన్‌ను ఇంటర్వ్యూ చేయబోతున్నారు. 2018లో వచ్చిన ‘Mrs. సుబ్బలక్ష్మి’ వెబ్‌ సిరీస్‌లో మంచు లక్ష్మి చివరిసారిగా కనిపించారు. ఆపై కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు