మీమ్‌ పేజీల గురించి సమాచారం ఇవ్వండి

ప్రముఖ గాయని చిన్మయి నెటిజన్లను ఓ సాయం కోరారు. తన గురించి అసభ్యకరంగా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్న పేజీల సమాచారం ఇవ్వమని అన్నారు. గత కొన్నిరోజులుగా తన గురించి సోషల్‌మీడియా పలు మీమ్స్‌ వస్తోన్న తరుణంలో...

Published : 31 May 2020 14:27 IST

గాయని చిన్మయి

చెన్నై: ప్రముఖ గాయని చిన్మయి నెటిజన్లను ఓ సాయం కోరారు. తన గురించి అసభ్యకరంగా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్న పేజీల సమాచారం ఇవ్వాలని అడిగారు. ‘మీ అందరి నుంచి ఓ సాయం కోరుతున్నా. మీరు మీమ్‌ పేజీల ఫాలోవర్స్‌ అయితే నా గురించి అసభ్యకరంగా ఏమైనా మీమ్స్‌, కామెంట్స్ చూసి ఉంటే ఆ స్క్రీన్‌షార్ట్స్‌ దయచేసి పంపించండి. మీకు సంబంధించిన వివరాలను నేను ఎక్కడా బయటపెట్టను. తెలుగు సోషల్‌మీడియా మీమ్స్‌ పేజీలను ఎక్కువగా నేను ఫాలో అవ్వను. దీనితోపాటు నటీమణుల గురించి ఏమైనా అసభ్యకరమైన సమాచారం చూస్తే అది కూడా పంపించండి. ధన్యవాదాలు’ అని చిన్మయి పేర్కొన్నారు.  దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు కొన్ని స్ర్కీన్‌షార్ట్స్‌ పంపిస్తున్నారు. వాటిని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తోన్నారు.

ఎన్నో చిత్రాల్లో మధురమైన పాటలు పాడి చిన్మయి ప్రేక్షకులను అలరించారు. గాయనిగానే కాకుండా సమంత నటించిన పలు చిత్రాలకు ఆమె డబ్బింగ్‌ చెప్పారు. సమంత కథానాయికగా పరిచయమైన ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి గాను 2010లో బెస్ట్‌ ఫిమేల్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చిన్మయి నంది అవార్డు అందుకున్నారు. ఇటీవల ఆమె అలపించిన ‘96’, ‘జాను’ చిత్రాల్లోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతేడాది విడుదలైన ‘96’ చిత్రంలోని ‘కాదలే కాదలే’ పాట ఆమెకు ఎన్నో అవార్డులను అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని