స్నేహ ఇంటి కరెంట్ బిల్లు @42 వేలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెంట్ బిల్లు చెల్లించడం ప్రజలకు ఇబ్బందిగా మారిందని, కాబట్టి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బిల్లులు చెల్లించేందుకు అధికారులు అంగీకరిస్తే..
ట్వీట్ చేసిన నటి భర్త.. స్పందించిన టీఎన్ఈబీ
చెన్నై: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెంట్ బిల్లు చెల్లించడం పేద ప్రజలకు ఇబ్బందిగా మారిందని.. వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించేందుకు అధికారులు అంగీకరిస్తే బాగుంటుందని నటి స్నేహ భర్త ప్రసన్న కోరారు. తాజాగా ఆయన ఇంటికి రూ.42 వేలు కరెంట్ బిల్లు వచ్చింది. ఈ బిల్లుపై స్పందిస్తూ ‘లాక్డౌన్ సమయంలో టీఎన్ఈబీ (తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్) మనల్ని దోచుకుంటోందని ఎంతమంది భావిస్తున్నారు?’ అని ఓ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించి ‘లాక్డౌన్ సమయంలో టీఎన్ఈబీ కరెంట్ బిల్లులను ఎక్కువ మొత్తంలో విధిస్తోంది’ అంటూ కామెంట్లు పెట్టారు.
కాగా, ప్రసన్న పెట్టిన ట్వీట్‌పై తాజాగా టీఎన్ఈబీ స్పందించింది. ‘ప్రసన్న.. మార్చి నెల నుంచి మీరు కరెంట్ బిల్లును చెల్లించలేదు. అలా ఈ నాలుగు నెలలకు గాను మీరు చెల్లించాల్సిన మొత్తం కరెంట్ బిల్లు రూ.42,632. కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా మీటర్ రీడింగ్ తీయడం లేదని మేము ముందే వెల్లడించాం. అందుకు అనుగుణంగానే ముందు నెలలో ఎంత బిల్లు వచ్చిందో.. అదే మొత్తాన్ని మార్చి నెలలో చెల్లించమని కోరాం’ అని టీఎన్ఈబీ పేర్కొంది.
టీఎన్ఈబీ ట్వీట్‌పై ప్రసన్న స్పందిస్తూ.. ‘వ్యక్తిగతంగా ఆ మొత్తాన్ని చెల్లించడం నాకు సమస్య కాదు. మీరు చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించేశాను. కరెంట్ బిల్లు కట్టడంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియజేయాలని భావించాను. బిల్లులు చెల్లించడం విషయంలో ప్రభుత్వం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలని ఆశిస్తున్నాను. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించేందుకు అంగీకరిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. నేను చేసిన ట్వీట్‌తో మీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఏమైనా ఇబ్బంది పడితే క్షమించండి.’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పుడు బెంగళూరులో.. రేపు ఎక్కడైనా: నీటి విలువపై చిరంజీవి పోస్ట్
బెంగళూరు నీటి సమస్యపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ