బాలకృష్ణ కామన్‌ డీపీ వైరల్‌..!

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కామన్‌ డీపీ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. జూన్‌ 10న ఆయన తన 60వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఐదు రోజులు ముందుగానే డీపీని విడుదల చేశారు. నారా లోకేష్‌, అనిల్‌ సుంకర, మంచు మనోజ్‌, విష్ణు....

Published : 05 Jun 2020 21:38 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కామన్‌ డీపీ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. జూన్‌ 10న ఆయన 60వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఐదు రోజులు ముందుగానే డీపీని విడుదల చేశారు. నారా లోకేశ్‌‌, అనిల్‌ సుంకర, మంచు మనోజ్‌, విష్ణు, శ్రీకాంత్‌, నరేశ్‌‌, పూరీ జగన్నాథ్‌, ఛార్మి.. ఇలా చాలా మంది ప్రముఖులు ఈ ఫొటోను తమ సోషల్‌మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఈ డీపీ వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే 16.7 వేల మంది నందమూరి బాలకృష్ణ హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ఉపయోగించారు. ఈ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ‘ఆయనకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వెళ్తారేమో.. అయిన వాళ్లకి కష్టం వస్తే మాత్రం అర క్షణం కూడా ఆలోచించరు’ అనే క్యాప్షన్‌తో ఉన్న డీపీ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

‘కొందరు బాహ్యంగా, అంతరంగా స్వచ్ఛంగా ఉంటారు. అలాంటి వారి ప్రేమలో చాలా సులభంగా పడిపోతాం. మన ప్రియమైన బాలయ్య అలాంటి వ్యక్తే. ఈ జూన్‌ 10న ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని మనోజ్‌ ట్వీట్‌ చేశారు. బాలకృష్ణ ‘రూలర్‌’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆయన 106వ సినిమా ఇది. ఇందులో వేదిక, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని