మాధవీలత.. పెళ్లి చేసుకోనున్నారా..?

నటి మాధవీలత త్వరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారా? అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె గత కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ఆమె తరచూ అందుబాటులో ఉండేవారు. తన రోజువారీ లైఫ్‌స్టైల్‌...

Updated : 06 Jun 2020 10:46 IST

వైరల్‌గా మారిన నటి పోస్ట్‌

హైదరాబాద్‌: నటి మాధవీలత త్వరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారా?.. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ఆమె తరచూ అందుబాటులో ఉంటారు. తన రోజువారీ లైఫ్‌స్టైల్‌ గురించి నెటిజన్లతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ‘కొన్ని నెలల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. అలాగే నా జీవితంలో కూడా అద్భుతాలు జరిగాయి. వాటివల్ల నేను చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. త్వరలోనే నా సంతోషానికి గల కారణం ప్రకటిస్తాను.’ అని మాధవీలత పేర్కొన్నారు.

మాధవీలత పెట్టిన పోస్ట్‌తో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘లేదు నేను రాజకీయాల్లోనే ఉంటున్నాను’ అని ఆమె తెలిపారు. దీంతో ఆమె వివాహం చేసుకోనున్నారంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ‘మేడమ్‌ మీరు ప్రేమలో పడ్డారా? మీరు త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారా?’ అని కామెంట్లు పెడుతున్నారు.

రవిబాబు దర్శకత్వం వహించిన ‘నచ్చావులే’ చిత్రంతో మాధవీలత వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అనంతరం ఆమె తెలుగులో తెరకెక్కిన పలు చిత్రాల్లో సందడి చేశారు. నాని కథానాయకుడిగా నటించిన ‘స్నేహితుడా’ చిత్రంలో మాధవీలత కథానాయికగా మెప్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని