విజయ్‌ దేవరకొండ రియల్‌లైఫ్‌లో అలా ఉండరు

కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో కలిసి పనిచేయడం తన అదృష్టమని బాలీవుడ్‌ నటి అనన్యా పాండే అన్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఫైటర్‌’. ఇందులో విజయ్‌ దేవరకొండ సరసన అనన్య నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న....

Published : 09 Jun 2020 10:27 IST

అది నా అదృష్టం: అనన్యా పాండే

హైదరాబాద్‌: కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో కలిసి పనిచేయడం తన అదృష్టమని బాలీవుడ్‌ నటి అనన్యా పాండే అన్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఫైటర్‌’. ఇందులో విజయ్‌ దేవరకొండ సరసన అనన్య నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌, పూరీ జగన్నాథ్‌ టాకీస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం కోసం విజయ్‌ ఇటీవల ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌ వెళ్లి ఫిజికల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ముంబయిలో 40 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయింది.

ఈ చిత్రంలో నటించడం గురించి అనన్య తాజాగా మీడియాతో మాట్లాడారు. చాలా ఉత్సుకతగా ఉన్నట్లు చెప్పారు. ‘నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా. ఇది ఓ విభిన్నమైన సినిమా. నా తొలి పాన్‌ ఇండియా చిత్రం, ఐదు భాషల్లో రాబోతోంది. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. పూరీ, ఛార్మి, విజయ్‌ చాలా చక్కగా మాట్లాడతారు, సరదాగా ఉంటారు. విజయ్‌ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ చూశా. ఆయన నటన చాలా నచ్చింది. నేను తొలిసారి విజయ్‌ను ధర్మ ప్రొడక్షన్‌ ఆఫీసులో చూశా. ఓ మైగాడ్‌.. నేను సినిమాలో చూసిన స్టార్ ఇక్కడ ఉన్నాడు..! అనుకున్నా. ఒక్కోసారి నేను కూడా యాక్టర్‌ అనే సంగతి మర్చిపోతుంటా. ఎదురుగా వస్తున్న స్టార్‌ను చూసి ఉత్సాహం ప్రదర్శిస్తుంటా’.

‘ఈ చిత్రంలో విజయ్‌ పూర్తిగా విభిన్నమైన అవతార్‌లో కనిపిస్తారు. ఆయన రోల్‌ అభిమానులకు కచ్చితంగా నచ్చుతుంది. విజయ్‌ తెరపై పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో స్వీట్‌గా, సున్నితంగా, మౌనంగా ఉంటారు. భాష పరంగా నాకు ఎటువంటి సమస్య లేదు. సెట్‌లో మేమంతా ఇంగ్లిషులోనే మాట్లాడతాం. కొన్నిసార్లు తెలుగులో మాట్లాడుతుంటారు. వారి ముఖకవళికలు, పరిస్థితి చూసి మాటల్ని అర్థం చేసుకుంటుంటా. దక్షిణాదిలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నా’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని