ఫిబ్రవరి 11న.. ‘డెత్‌ ఆన్‌ ది నైల్‌’

కెన్నెత్‌ బ్రనాగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘డెత్‌ ఆన్‌ ది నైల్‌’. ఆయన దర్శకత్వం నుంచి వచ్చిన ‘ది మర్డర్‌ ఆన్‌ ది ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌’కు కొనసాగింపుగా రూపొందింది. అలీ ఫజల్‌, ఆర్మీ హామర్‌, గాల్‌ గాడోట్‌, రోజ్‌ లెస్లీ, రస్సెల్‌ బ్రాండ్‌, ఎమ్మా మాకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Published : 29 Jan 2022 03:37 IST

కెన్నెత్‌ బ్రనాగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘డెత్‌ ఆన్‌ ది నైల్‌’. ఆయన దర్శకత్వం నుంచి వచ్చిన ‘ది మర్డర్‌ ఆన్‌ ది ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌’కు కొనసాగింపుగా రూపొందింది. అలీ ఫజల్‌, ఆర్మీ హామర్‌, గాల్‌ గాడోట్‌, రోజ్‌ లెస్లీ, రస్సెల్‌ బ్రాండ్‌, ఎమ్మా మాకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని భారత్‌లో ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ట్వంటీయెత్‌ సెంచరీ స్టూడియో సంస్థ ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. 1937లో వచ్చిన అగాథా క్రిస్టీ ‘డెత్‌ ఆన్‌ ది నైల్‌’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. విభిన్నమైన మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో సాగే ఈ చిత్రంలో.. డిటెక్టివ్‌ హెర్క్యులే పోయిరోట్‌గా బ్రనాగ్‌ సందడి చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని