కళ్లు తిప్పుకోలేని సొగసులు

75 కేన్స్‌ ఫిల్మ్‌ ఉత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కొత్త రకాల ఫ్యాషన్‌ దుస్తులతో కథానాయికలు తమ హొయలను రెడ్‌కార్పెట్‌పై పరుస్తుంటే... కెమెరాలు ఎలా కళ్లు తిప్పుకుంటాయి చెప్పండి. ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో అదితిరావ్‌ హైదరీ, నర్గీస్‌

Published : 24 May 2022 02:02 IST

75 కేన్స్‌ ఫిల్మ్‌ ఉత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కొత్త రకాల ఫ్యాషన్‌ దుస్తులతో కథానాయికలు తమ హొయలను రెడ్‌కార్పెట్‌పై పరుస్తుంటే... కెమెరాలు ఎలా కళ్లు తిప్పుకుంటాయి చెప్పండి. ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో అదితిరావ్‌ హైదరీ, నర్గీస్‌ ఫక్రీ సందడి చేశారు. తమ ఆకర్షణీయమైన గౌన్లతో చూపురులను కట్టిపడేశారు.

*అభయ్‌వర్మ, మీరా చోప్రా ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘సఫేద్‌’. దీని ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ ఈ ఉత్సవంలో ఆవిష్కరించారు. దర్శకుడు సందీప్‌ సింగ్‌కు ఇది తొలిచిత్రం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా తొలిచిత్ర ఫస్ట్‌లుక్‌ను రెహమాన్‌ ఆవిష్కరించడకన్నా మాకు గర్వకారణమైనది ఏముంటుంది’ అన్నారు.

*తమిళ దర్శకుడు, నటుడు తెరకెక్కించిన ‘ఇరవిన్‌ నిజాల్‌’ చిత్రం కేన్స్‌లో అందరిదృష్టిని ఆకర్శించింది. 100 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాని ఒకే షాట్‌లో తీశారు. దీనికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతమందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని