మేటి పోరాటాల.. మిషన్‌ ఇంపాజిబుల్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రికనింగ్‌ మొదటిభాగం’ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. పారామౌంట్‌ పిక్చర్స్‌, స్కై డ్యాన్స్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి.

Published : 25 May 2022 01:09 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రికనింగ్‌ మొదటిభాగం’ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. పారామౌంట్‌ పిక్చర్స్‌, స్కై డ్యాన్స్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే.. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకుందీ ట్రైలర్‌. హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ టామ్‌ క్రూజ్‌ ఇందులో గూఢచారిగా నటించగా, తనకి జోడీగా రెబెక్కా ఫెర్గూసన్‌ అచ్చెరువొందే సాహసాలు చేసింది. క్రిస్టఫర్‌ మెక్‌క్యారీ, డేవిడ్‌సన్‌ అబ్రహం, వింగ్‌ రేమ్స్‌.. కీలక పాత్రలు పోషించారు. క్రిస్టఫర్‌ మెక్‌క్యారీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌లో ఇది ఏడో చిత్రం. ఎప్పట్లాగే ఇందులోనూ ఒళ్లు గగుర్పాటు పొడిచే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయంటున్నాయి చిత్రవర్గాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని