Cinema news: ‘జోకర్‌’.. మళ్లీ వస్తున్నాడు

జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘జోకర్‌’ బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.07 బిలియన్‌

Updated : 06 Aug 2022 02:47 IST

జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘జోకర్‌’ బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.07 బిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టడమే కాక.. అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ  సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఫీనిక్స్‌ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘జోకర్‌: ఫోలీ ఎ డ్యూక్స్‌’ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన టాడ్‌ ఫిలిప్స్‌ ఈ సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని 2024 అక్టోబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్ర సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. ‘జోకర్‌’కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సీక్వెల్‌లో హార్లే అనే కీలక పాత్రలో లేడీ గాగా సందడి చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని