సముద్ర గర్భంలో.. సరికొత్త లోకం

‘అవతార్‌’ చిత్రం.. అందులోని పండోరా గ్రహం.. అక్కడ నివసించే చిత్రమైన మనుషులు.. గాలిలో ఎగిరే డ్రాగన్‌ పక్షులు.. ఇలా అందులోని ప్రతి అంశం సినీ ప్రియుల మనసులపై చెరగని ముద్రవేశాయి. ఈ అపురూప దృశ్య కావ్యాన్ని తెరపై ఆవిష్కరించిన

Published : 07 Aug 2022 01:59 IST

‘అవతార్‌’ చిత్రం.. అందులోని పండోరా గ్రహం.. అక్కడ నివసించే చిత్రమైన మనుషులు.. గాలిలో ఎగిరే డ్రాగన్‌ పక్షులు.. ఇలా అందులోని ప్రతి అంశం సినీ ప్రియుల మనసులపై చెరగని ముద్రవేశాయి. ఈ అపురూప దృశ్య కావ్యాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. ఇప్పుడాయన ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో సముద్ర గర్భంలోని మరో సరికొత్త ఊహా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. ‘అవతార్‌’కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. సామ్‌ వర్తింగ్టన్‌, జో సల్డానా, స్టీఫెన్‌ లాంగ్‌, క్లిఫ్‌ కర్టిస్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నుంచి ఓ కొత్త లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో నాయనాయికలిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని