సీతారామంకు మాటిచ్చాడు

పెళ్లకూరు మండలం జీలపాటూరు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ సినీరంగంలో రాణిస్తున్నాడు. తల్లిదండ్రులు కందమూడి శివకుమార్‌, యశోదలు. కొత్త ఆలోచనలకు పదనుపెడితే దూసుకెళ్లవచ్చని.. యువతకు ఈ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని నిరూపిస్తున్నాడు

Updated : 11 Aug 2022 09:09 IST

 సినిమానే ప్రపంచంగా అడుగులు
మాటల రచయితగా రాణిస్తున్న కుర్రాడు

భార్య కిరణ్మయితో రాజ్‌కుమార్‌ కందమూడి

పెళ్లకూరు, న్యూస్‌టుడే : పెళ్లకూరు మండలం జీలపాటూరు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ సినీరంగంలో రాణిస్తున్నాడు. తల్లిదండ్రులు కందమూడి శివకుమార్‌, యశోదలు. కొత్త ఆలోచనలకు పదనుపెడితే దూసుకెళ్లవచ్చని.. యువతకు ఈ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని నిరూపిస్తున్నాడు. ప్రాథమిక విద్య స్థానికంగా చదివిన యువకుడు ఇంటర్‌ నాయుడుపేటలో పూర్తిచేశాడు. ఇంజినీరింగ్‌ తిరుపతిలో పూర్తిచేశాక 2015లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌ చేరాడు.. మూడేళ్ల కిందట సొంత గ్రామానికి చెందిన కిరణ్మయితో వివాహం జరిగింది. ఉద్యోగం చేసుకుంటూనే సినీరంగంపై మక్కువతో ప్రయత్నాలు ప్రారంభించాడు. చివరకు తనకిష్టమైన రంగంలో పూర్తిగా దృష్టిసారించేందుకు ఉద్యోగం వదిలేశాడు. కథ, మాటల రచయితగా కొన్ని కథలు సిద్ధం చేసుకున్నాడు. వాటితో యువ దర్శకుల వద్దకు వెళ్తుండగా అను రాఘవపూడితో పరిచయం ఏర్పడింది. అలా ‘సీతారామం’ సినిమాకి మాటల రచయితగా పరిచయం అయ్యాడు. తొలిచిత్రం విడుదలై విజయవంతం కావడం గ్రామంలో సందడి తెచ్చింది.
కొవిడ్‌తో కొత్త ఆలోచనలు : కొవిడ్‌ కారణంగా రెండేళ్ల విరామం దొరికిందని.. ఆ సమయంలో కథ, మాటల రచయితగా తర్ఫీదు పొందడానికి, మరింత నైపుణ్యం పెంచుకోవడానికి అవకాశం దొరికిందంటున్నాడు రాజ్‌కుమార్‌. ప్రస్తుతం సినిమానే ప్రపంచంగా మార్చుకుని కథలు, మాటలు రాస్తున్నాడు. మలి ప్రాజెక్టు కోసం ఓ కథనం సిద్ధం చేస్తున్నట్లు ‘న్యూస్‌టుడే’కి వివరించారు. సినీ రంగంలోనే తనకు సంతృప్తి లభిస్తోందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని