Chiranjeevi: అభిమానికి క్యాన్సర్‌.. అండగా నిలిచిన చిరంజీవి

క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానిని చూసి ప్రముఖ నటుడు చిరంజీవి చలించిపోయారు. అతణ్ని కలిసి అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు.

Published : 16 Aug 2022 18:32 IST

హైదరాబాద్‌: క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానిని చూసి ప్రముఖ నటుడు చిరంజీవి చలించిపోయారు. అతడిని కలిసి అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. ఆ అభిమాని.. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్‌. క్యాన్సర్‌ బారిన పడటంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. విషయం తెలుసుకున్న చిరంజీవి మెరుగైన వైద్యం కోసం చక్రధర్‌ని హైదరాబాద్‌కు రప్పించి, ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. స్వయంగా ఆస్పత్రికి చేరుకుని చిరంజీవి తన అభిమానిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చక్రధర్‌ ఆరోగ్య  పరిస్థితి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందిచాలని కోరారు. తానెప్పుడూ అండగా ఉంటానని చక్రధర్‌ కుటుంబానికి చిరంజీవి ధైర్యాన్ని ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని