RRR: చంద్రబాబు అభినందన.. ఎన్టీఆర్‌ రిప్లై

తెలుగు సినిమా ఖ్యాతి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచ వేదికలపై నిలిచిందని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు.

Published : 12 Jan 2023 07:42 IST

అమరావతి: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ప్రపంచ ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడం పట్ల ప్రముఖులంతా మూవీ టీమ్‌ను అభినందిస్తున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లే కాకుండా రాజకీయ, వాణిజ్య, వ్యాపార రంగాలకు చెందిన వారూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో పాటు మూవీ టీమ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో చిత్రబృందాన్ని అభినందిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేయగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రీట్వీట్‌ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు సినిమా ఖ్యాతి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచ వేదికలపై నిలిచిందని  చంద్రబాబు కొనియాడారు. ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును చిత్రంలోని ‘నాటు నాటు’ పాట దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన చంద్రబాబు ట్వీట్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ‘థాంక్యూ సో మచ్‌ మావయ్యా’ అని రీట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని