పరిణీతి.. యంగ్‌ అఛీవర్‌

‘ఊంఛాయీ’తో మెప్పించిన కథానాయిక పరిణీతి చోప్రా ‘క్యాప్సూల్‌ గిల్‌’, ‘చమ్కీలా’ చిత్రీకరణలో బిజీగా ఉంది. తను ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ కొత్త కబురు చెప్పింది.

Published : 06 Feb 2023 01:26 IST

‘ఊంఛాయీ’తో మెప్పించిన కథానాయిక పరిణీతి చోప్రా ‘క్యాప్సూల్‌ గిల్‌’, ‘చమ్కీలా’ చిత్రీకరణలో బిజీగా ఉంది. తను ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ కొత్త కబురు చెప్పింది. అయితే ఇది సినిమాలకు సంబంధించిన విషయం కాదు. ఆమె వ్యక్తిగత విజయం. భారత్‌కి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా బ్రిటీష్‌ కౌన్సిల్‌ ఇంగ్లండ్‌లో విద్యనభ్యసించి, వివిధ రంగాల్లో విజయం సాధించిన 75 మందిని యంగ్‌ అఛీవర్స్‌గా గుర్తించింది. కళలు, సంస్కృతి, వినోదం విభాగంలో పరిణీతిని ఎంపిక చేశారు. జనవరి 25నే ఈ పురస్కారం అందుకున్న పరిణీతి తాజాగా ఈ వివరాలను పంచుకుంటూ ‘జీవితం ఒక వృత్తంలాంటిది’ అని కామెంట్‌ జోడించింది. చదువుల్లో ముందుండే పరిణీతి చోప్రా 2009 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ నుంచి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని