Gentleman: ‘జెంటిల్‌మ్యాన్‌ 2’ దర్శకుడు ఖరారు.. ఎవరంటే?

కథానాయకుడు అర్జున్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ కలయికలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘జెంటిల్‌మ్యాన్‌’.

Published : 06 Jun 2022 21:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు అర్జున్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ కలయికలో సుమారు 29 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘జెంటిల్‌మ్యాన్‌’. ఈ సినిమాని నిర్మించిన కె. టి. కుంజుమోన్‌ ‘జెంటిల్‌మ్యాన్‌ 2’ని (Gentleman 2) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సంగీత దర్శకుడు, నాయికల వివరాలు వెల్లడించిన ఆయన తాజాగా ఈ చిత్ర దర్శకుడెవరో చెప్పారు. ఎ. గోకుల్‌ కృష్ణ ఈ క్రేజీ ప్రాజెక్టుకు సారథ్యం వహించనున్నారని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన గోకుల్‌ గతంలో నాని హీరోగా ‘ఆహా కల్యాణం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకుడిగా ఎంపికైన ఈ చిత్రంలో నయనతార చక్రవర్తి, ప్రియాలాల్‌ కథానాయికలు. ఈ చిత్ర కథానాయకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని