Ghani: ‘గని’ ప్రత్యేక గీతం ఫుల్‌ వీడియో.. తమన్నా డ్యాన్స్‌ అదిరింది!

ఇప్పటికే పలు చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో కనిపించి, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తమన్నా ‘గని’తో మరోసారి సందడి చేయనుంది.

Updated : 07 Dec 2022 17:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే పలు చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో కనిపించి, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తమన్నా ‘గని’తో మరోసారి సందడి చేసింది. వరుణ్‌తేజ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ‘కొడితే’ అనే స్పెషల్‌ సాంగ్‌లో ఆమె నర్తించింది. ఇటీవల విడుదలైన లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభించగా చిత్ర బృందం తాజాగా ఫుల్ వీడియోను విడుదల చేసింది. ఎప్పటిలానే తమన్నా డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటను హారికా నారాయణ్‌ ఆలపించింది. తమన్‌ స్వరాలందించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా సయీ మంజ్రేకర్‌ నటించింది. జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదలకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని