Ghani: ‘గని’ ఓటీటీ రాకకు డేట్‌ ఫిక్స్‌..!

బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథాంశంతో వరుణ్‌తేజ్‌ నటించిన సరికొత్త చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు..

Updated : 17 Apr 2022 13:16 IST

హైదరాబాద్‌: బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథాంశంతో వరుణ్‌తేజ్‌ నటించిన చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు.. కుటుంబం, ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తల్లికిచ్చిన మాట కోసం అతడు బాక్సింగ్‌కు దూరమవుతాడా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ‘గని’ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఆహా’ ప్లాట్‌ఫామ్ వేదికగా ఈ నెల 22న ‘గని’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే వరుణ్‌తేజ్‌కు జోడీగా నటి సయీ మంజ్రేకర్‌ నటించారు. నదియా, ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్‌ శెట్టి కీలకపాత్రలు పోషించారు. అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని