Ghani: ‘గని’ వచ్చేది ఆ రోజేనా?
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌కి జోడిగా సయీ మంజ్రేకర్ నటిస్తోంది. కాగా.. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం.. తమ నిర్ణయాన్ని మార్చుకున్న విషయం
ఇంటర్నెట్ డెస్క్: వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌కి జోడిగా సయీ మంజ్రేకర్ నటిస్తోంది. కాగా.. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం.. తమ నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే, చిత్రాన్ని ఏప్రిల్ 2న భారీస్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు ఆ తేదీనే ‘గని’ వస్తాడని అంటున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నారు. సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!