
Ghani: ‘గని’ వచ్చేది ఆ రోజేనా?
ఇంటర్నెట్ డెస్క్: వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌కి జోడిగా సయీ మంజ్రేకర్ నటిస్తోంది. కాగా.. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం.. తమ నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే, చిత్రాన్ని ఏప్రిల్ 2న భారీస్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు ఆ తేదీనే ‘గని’ వస్తాడని అంటున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నారు. సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూర్చారు.