Ghantasala: ‘‘చుట్ట ఎక్స్‌ట్రా ఉంది.. ఇవ్వనా’’

పాటల రికార్డింగ్‌ సందర్భంగా ఘంటసాల, భానుమతి మధ్య జరిగిన ఆసక్తికర సన్నివేశం

Published : 10 Nov 2022 15:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మల్లీశ్వరి’(1951) పాటల రికార్డింగ్‌ తర్వాత వాటిని తన బృందంతో కలిసి వింటూ దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి.. ‘‘ఘంటసాల ఎంతో భావగర్భితంగా పాడారు. నువ్వు ఆయనంత బాగా పాడ లేదు’’ అని భానుమతితో అన్నారట. బృందంలో వారంతా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. చిన్న బుచ్చుకున్న భానుమతి ‘ఆయన చుట్ట తాగి పాడారు. అందుకే గొంతు సాఫ్ట్‌ అయింది’ అని ఎత్తి పొడిచారట. (అప్పట్లో రికార్డింగ్‌కి ముందు గొంతు పదునెక్కాలని ఘంటసాల చుట్ట తాగేవారట). భానుమతి వ్యాఖ్య విన్న ఘంటసాల తడుముకోకుండా ‘నా దగ్గర ఓ చుట్ట ఎక్స్‌ట్రా ట్రా ఉంది. అడిగితే ఇచ్చేవాణ్ని కదా..’ అని నవ్వుతూ అన్నారట. దాంతో అలకబూనిన భానుమతి ‘చక్రపాణి’కి సంగీత దర్శకత్వం చేసిన సమయంలో బదులు తీర్చుకున్నారని చెబుతారు. అందులో ‘ఓ ప్రియురాలా... ఓ జవరాలా’ అనే పాటను ప్రాక్టీస్‌ చేయడానికి ఘంటసాలను పిలిచి ఆయన చేత చాలా సార్లు పాడించి, ‘మీరు సరిగా పాడటం లేదు. ఇది విజయా సంస్థ కాదు. భరణీ సంస్థ’ అని ఎత్తి పొడిచారట. మనసు నొచ్చుకున్న ఘంటసాల మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని